కారు గుర్తుకే మన ఓటుమాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపు

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఫిబ్రవరి 5 (జర్నలిస్ట్ వార్త):
రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఓటర్లను కోరారు. గురువారం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఒకటో వార్డ్ కౌన్సిలర్ తుమ్మల యాకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరూరి రమేష్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలంటే మళ్ళీ కారు గుర్తు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముడుసు నర్సింగం వరంగల్ 14వ డివిజన్ అధ్యక్షుడు, వర్ధన్నపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుల్ల కుమారస్వామి,
 ఐనవోలు మండలం మాజీ వైస్ చైర్మన్ తనంపుల మోహన్, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని, ప్రచారాన్ని విజయవంతం చేశారు.