వర్ధన్నపేటలో ఘోర ప్రమాదం కారు ఢీకొని మున్సిపల్ వాటర్‌మ్యాన్ మృతి

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఫిబ్రవరి 4(జర్నలిస్ట్ వార్త);
 వర్ధన్నపేట పట్టణంలో బుధవారం  
విషాద సంఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీ కార్యాలయంలో వాటర్‌మ్యాన్‌గా పనిచేస్తున్న ఓర్సు మల్లయ్య (50) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. మల్లయ్య తన లూనా వాహనంపై మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ఒక కారు అతివేగంగా వచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్ర గాయాలవ్వడంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. విధినిర్వహణలో భాగంగా ఆఫీసుకి వెళ్తున్న వ్యక్తి ఇలా అనంత లోకాలకు వెళ్లడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానిక మున్సిపల్ సిబ్బంది, కార్మికులు మల్లయ్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.