వర్ధన్నపేట/ఫిబ్రవరి2(జర్నలిస్ట్ వార్త):
ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ పితృమూర్తి బిర్రు యాకయ్య దశదిన కార్యక్రమం సోమవారం నల్లబెల్లి గ్రామంలోని వారి నివాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడింది. క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని యాకయ్య కుటుంబాన్నికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం రెవరెండ్ ప్రకాష్, పాస్టర్ సుమన్, పర్వతగిరి మండల పాస్టర్ల సంఘం నాయకులు తిమోతి, పాస్టర్ ప్రభాకర్, దేవేందర్, ఆరుణ్ పాల్ ఆధ్వర్యంలో జరిగింది.
యాకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
తరలివచ్చిన నాయకులు, ప్రముఖులు
బిర్రు యాకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో జిల్లా క్రైస్తవ మత పెద్దలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు
ఎంఆర్పీఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నివాళులర్పించిన అనంతరం నాయకులు బిర్రు మహేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సమాజం పట్ల యాకయ్యకు ఉన్న నిబద్ధతను, ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.