బిర్రు యాకయ్య కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మన్నె బాబురావు పరామర్శ

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఫిబ్రవరి2(జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు బిర్రు మహేందర్ తండ్రి బిర్రు యాకయ్య దశదిన కర్మ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాల మహానాడు రాష్ట్ర నాయకులు  మన్నె బాబురావు హాజరై, యాకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్నె బాబురావు మాట్లాడుతూ.. యాకయ్య మరణం ఆ కుటుంబానికి, గ్రామానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. యాకయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా బిర్రు మహేందర్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని బాబురావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు, జర్నలిస్ట్ ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.