కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి... చిల్పూర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు

journalist vaartha
By -
స్టేషన్ ఘన్ పూర్/ఫిబ్రవరి5(జర్నలిస్ట్ వార్త);
స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని
చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు అన్నారు.  స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల కార్యక్రమంలోభాగంగా 16, 17,18 వార్డ్ ల ఇంచార్జ్,చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్ల పల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలోఆధ్వర్యంలో ఇంటిం టి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ద్వారానే సాధ్యమని అన్నా రు. అందుకు కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండలం అధ్యక్షుడు గడ్డమీధీ సురేష్, బొమ్మిశెట్టి బాలరాజు, మాజీ జెడ్పిటిసి స్వామి నాయక్, మల్కాపూర్ సర్పంచ్ మల్లారెడ్డి, పల్ల గుట్ట సర్పంచ్ నర సింహా రెడ్డి, చిల్పూర్ మండల యూత్ అధ్యక్షుడు ఇసురం రాజు, రత్నాకర్ రెడ్డి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ఐలపాక మనోజ్ కుమార్, మూడు వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు,అంగడి రజిత,కృష్ణ, పొన్నం స్వరూప రాజయ్య, పొన్న రవి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, తది తరులు పాల్గొన్నారు.