కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని మరింత అభివృద్ధి చెందాలి... వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

journalist vaartha
By -

స్టేషన్ ఘన్ పూర్/ఫిబ్రవరి5(జర్నలిస్ట్ వార్త) : 
స్టేషన్ ఘనపూర్‌కు మున్సిపాలిటీ రావడంతో అభివృద్ధి మహర్దశ ప్రారంభమైందని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని మరింత అభివృద్ధి చెందాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. స్టేషన్ ఘన్పూర్ లోని 10, 11 వార్డుల లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజల గడప గడపకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రతి కుటుం బాన్ని ఆప్యాయంగాపలకరిస్తూ ప్రచారాన్నిఉత్సా హంగా కొనసాగించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్‌కు మున్సి పాలిటీ రావడంతో అభివృద్ధి మహర్దశ ప్రారంభ మైందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజ లందరిపై ఉందని అన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎన్నికైన తరువాతనే స్టేషన్ ఘనపూర్‌కు మున్సిపాలిటీసాధ్యమైందని గుర్తుచేశారు.మున్సి పాలిటీ ఏర్పడిన వెంటనే 50కోట్ల నిధులు తీసుకొ చ్చి అభివృద్ధిపనులు ప్రారంభించారని తెలిపారు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్టేషన్ ఘనపూర్ పట్టణ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల విషయంలోప్రజలను మోసంచేసిన ఘనత బీఆర్‌ ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆరోపించారు. గత పాలకులు అవినీతి, ఆక్రమణలు, బెదిరింపు లు, భూకబ్జాలతో పాలన సాగించారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపా రు. రైతులు, కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులకు స్థానిక సమస్య లపై పూర్తి అవగాహన ఉందని, పేద, మధ్యతరగతి కుటుంబాలనుంచి వచ్చిన అభ్యర్థులని చెప్పారు. వారిని గెలిపిస్తే మరింత వేగంగా అభివృద్ధిజరుగుతుందని స్పష్టం చేశారు. ఓటును ఆయు ధంగాచేసుకుని ఈమున్సిపల్ ఎన్నికల్లో18 వార్డు లలో కాంగ్రెస్ పార్టీ ఘన విజ యం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్య క్రమంలో స్టేషన్గన్పూర్ లోని 10వ వార్డు అభ్యర్థి తోకల అనూష,11వ వార్డు అభ్యర్థి నీల రాజమ్మ గట్టయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య- శిరీష్ రెడ్డి, మత్స్య సొసైటీ జిల్లా చైర్మన్ నీల రాజు, నాయకులు శివకుమార్, గుడి వంశీధర్ రెడ్డి, అంబటి కిషన్ రాజ్, గోనెల ఎల్లయ్య, గోనెల రాజయ్య, ఎండి యాకూబ్ పాషా, నీల వెంకటేశ్వ ర్లు, చిరంజీవి,రాములు, తోకల సమ్మయ్య , నీల నరసింహులు, గోనెల రాజు, నీల శ్రీధర్, గాండ్ల రాజు, కొలిపాక సతీష్, నీల సోమన్న, రఘు, యాదగిరి, అనిల్, సాంబరాజు వార్డు అబ్జర్వర్లు ఇన్చార్జిలు కాంగ్రెస్ పార్టీనాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.