వర్ధన్నపేట/ ఫిబ్రవరి8(జర్నలిస్ట్ వార్త); దళితులను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగనీయకుండా అణచివేసిన చరిత్ర మాజీ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు దే అని,
వర్ధన్నపేట అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం మవుతుంది వర్ధన్నపేట
మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య అన్నారు.
ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు
ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు దళితులను రాజకీయంగా, ఆర్థికంగా ఎదగనీయకుండా అణచివేసిన చరిత్ర ఆయనదని ఆరోపించారు. మంత్రిగా ఉండి కూడా కొత్త పంచాయతీ భవనాలు నిర్మించలేదని, సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారని విమర్శించారు. నేడు రేవంత్ రెడ్డి సర్కార్ ఆ పాత బిల్లులను చెల్లించి సర్పంచ్‌లను ఆదుకుంటోందని గుర్తు చేశారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు కేవలం కాంట్రాక్టుల కోసం, చెరువులు, కుంటలు, గుట్టల కబ్జాల కోసం రాజకీయాలను వాడుకున్నారని మండిపడ్డారు. పార్టీలు మారుతూ సిద్ధాంతాలు లేని రాజకీయం చేస్తున్న నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు సారథ్యంలో వర్ధన్నపేట రూపురేఖలు మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు:
రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం. పట్టణానికి మున్సిఫ్ కోర్టు, సబ్ జైలు మంజూరు. కొనారెడ్డి చెరువు పునరుద్ధరణ, నిరుపేదలకు 150 ఇళ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు అభ్యర్థి శ్రీలత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడీ రాజ్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ వరంగల్ టౌన్ అధ్యక్షురాలు నాగపురి స్వప్న గౌడ్, పులి శ్రీనివాస్ గౌడ్, తీగల సునీత గౌడ్, మరుపట్ల అరుణ, శివరాత్రి వెంకట్ నర్స్, మరుపట్ల సాయికుమార్, నాగపురి మురళి గౌడ్, బొంత రంగనాథ్, శివరాం తదితరులు పాల్గొన్నారు.