వర్ధన్నపేట/ఫిబ్రవరి7 (జర్నలిస్ట్ వార్త):
యువతకు ఉపాధి అవకాశాలు.
కోనాపురం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టీ
వర్ధన్నపేట రూపురేఖలు మారుస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.
వర్ధన్నపేట మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా శ్రీలత రామును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కోనాపురం గ్రామంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వయంగా పాల్గొని ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
గ్రామంలోని విద్యుత్, తాగునీటి బోరు మోటార్, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మౌలిక సదుపాయాలు: స్మశాన వాటికకు స్థలం కేటాయింపుతో పాటు అక్కడ అవసరమైన వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కోనాపురం సమీపంలో అభివృద్ధి పనులకు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ , మినీ స్టేడియం
సబ్ జైలు , మున్సిఫ్ కోర్టు
100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లాంటి అభివృద్ధి పనుల ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాల్లో స్థానిక యువతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. కోనాపురం రూపురేఖలు మార్చే బాధ్యత నాదని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హామీలు ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజీరెడ్డితో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.