వర్ధన్నపేట/ ఫిబ్రవరి 8(జర్నలిస్ట్ వార్త); కేటీఆర్ ప్రజలను బుద్ధి తెచ్చుకోవాలనడం మీ అహంకారానికి నిదర్శన మని
కాంగ్రెస్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కుల్ల యాకాంతం అన్నారు. ఆదివారం వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి హాజరైనా మాజీ మంత్రి కే టి ఆర్ టి ఆర్
వ్యాఖ్యలను తప్పుబడుతూ
యువజన కాంగ్రెస్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కుల్ల యాకాంతం ఒక ప్రకటన విడుదల చేశారు. బి,ఆర్ ఎస్ పార్టీ, 10 ఏళ్ల పాలనలో ప్రజలను వంచించినందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, అయినా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గలేదన్నారు. గడిచిన
10 ఏళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేని కేటీఆర్, మున్సిపల్ మంత్రిగా వర్ధన్నపేటకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు కన్నీరు పెట్టారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు, గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రూప్-1 ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తు చేశారు. వరి వేస్తే ఉరి అని గతంలో రైతులను బెదిరించిన చరిత్ర బీఆర్ఎస్‌ది అని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గతంలో ప్రజలు వద్దంటున్నా తండాలను మున్సిపాలిటీలో కలిపి అన్యాయం చేసింది బీఆర్ఎస్ నేతలేనని, ఇప్పుడు ఓటమి భయంతో తండాలను వేరు చేస్తామంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవతో తండాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.