గందరగోళం మధ్య ఆలస్యమవుతున్న ఫలితాలు

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఫిబ్రవరి13(జర్నలిస్ట్ వార్త); వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రారంభమై గంటలు గడుస్తున్నా, కనీసం తొలి ఫలితం కూడా వెలువడకపోవడంతో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై దాదాపు రెండు గంటలైనా అధికారులు ఏ ఒక్క వార్డు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
వర్ధన్నపేటలో కేవలం 4 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. సాధారణంగా కౌంటింగ్ ప్రారంభంలోనే వీటిని వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, అధికారులు వాటి వివరాలను కూడా బయట పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తీరుపై కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచార సేకరణలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తున్నారు. చిన్న మున్సిపాలిటీలో ఫలితాల వెల్లడికి ఇంత సమయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. 
ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అధికారులు సమన్వయంతో ఫలితాలను త్వరగా వెల్లడించాలని అభ్యర్థులు కోరుతున్నారు.