డిజిటల్ కీ మాయం, సర్టిఫికెట్ల జారీ పై జిల్లా పంచాయతీ రాజ్ అధికారి స్వరూప నలుగురు పంచాయతీ కార్యదర్శులపై విచారణ.ఎంపిఓ పై డిఎల్పిఓ ఆగ్రహం.

journalist vaartha
By -

బయ్యారం/ ఫిబ్రవరి13(జర్నలిస్ట్ వార్త);
బయ్యారం మండలంలో పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ కీ మాయంపై ఈనెల స్థానిక పోలీస్ స్టేషన్లో ఈనెల 3న,కేసు నమోదుపై జరిగిన సంఘటన పై , మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జిల్లా పంచాయతీ అధికారులకు సమగ్ర విచారణ జరిపి నివేదిక పంపించాలని ఆదేశాలతో శుక్రవారం మహబూబాబాద్ పంచాయతీ రాజ్ లెజిస్లేటివ్ అధికారి స్వరూప ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ కి మాయం,అనుమతి లేకుండా 291, జనన,మరణ ధృవీకరణ పత్రాల జారి పోలీసు కేసు నమోదుపై ,తదితర విషయాలపై,విధులు నిర్వహణపై ఎంపీవో చంద్రమోహన్ పైఆగ్రహం వ్యక్తం చేస్తూ, వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్లు డి ఎల్ పి ఓ తెలిపారు. వారి కార్యాలయంలోని రిజిస్టర్ లను స్వాధీనపరచుకొని వెళ్లినట్లు తెలిపారు. ఇర్సులాపురంలో (96) నామాలపాడు,(159), 19 తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలు, చెరువు ముందు కొత్తగూడెం (09) బాల్య తండా (08 ) వీటిలో నాలుగు పంచాయతీల లో జనన,మరణ సర్టిఫికెట్ల 291, జారీ కావడంతో,పంచాయతీ కార్యదర్శులతో విడివిడిగా సమావేశమై ,డిజిటల్ కి మాయంపై ప్రశ్నించినట్లు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల ఆపరేటర్లను ఎంపీడీవో కార్యాలయంలో ఆపరేటర్ల సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలిపారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో జరిగిన సంఘటనను పరిశీలించి సమగ్ర నివేదిక కలెక్టర్ కు నివేదించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే , డిజిటల్ కీ మాయం అక్రమంగా సర్టిఫికెట్ల జారీ పై సమగ్ర విచారణ చేసి దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని, దానికి ఎవరు అతీతులు కారని తెలిపారు. జరిగిన సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి కలెక్టర్కు నివేదించనున్నట్లు ఆమె తెలిపారు