వర్ధన్నపేట/ఫిబ్రవరి16 (జర్నలిస్ట్ వార్త);
మండల కేంద్రంలోని నల్లబెల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కిషోర రక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్య బృందం రక్తహీనతను గుర్తించేందుకు రక్త పరీక్షలు, బ్లడ్ గ్రూపింగ్. హృదయ స్పందన రేటు, గుండె పనితీరు. దృష్టి లోపాలను గుర్తించేందుకు విజన్ టెస్ట్. ఎత్తు, బరువు మరియు ఇతర సాధారణ ఆరోగ్య సమస్యల గుర్తింపు లాంటి విద్యార్థులకు పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ రాజు, ఏఎన్ఎం దేవయాని, హెల్త్ అసిస్టెంట్ వేణు ప్రసాద్, సిబ్బంది పూల, ప్రేమలత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.