వర్ధన్నపేట/ఫిబ్రవరి22(జర్నలిస్ట్ వార్త);
వర్ధన్నపేట మండలం, చెన్నారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వ్యక్తుల కుటుంబాల్లో విషాదం నెలకొనగా, ఆరూరి రమేష్ ఆయా కుటుంబాలను కలిసి ఓదార్చారు. బర్ల సాయిలు సూతరి విష్ణుమూర్తి, కుమారుడు గణేష్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లిన ఆయన, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముఖ్యంగా గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో వారికి ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. కష్టకాలంలో మేము మీకు అండగా ఉంటాం అని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుల కుమారస్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు గుజ్జ వీర రాఘవరావు, తిరుపతి సురేష్, మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, రైతు కరీంనగర్ ఉపసర్పంచ్ క్రాంతి, వార్డు సభ్యులు బర్ల రాజు, ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.