నర్సంపేట/ఫిబ్రవరి 23(జర్నలిస్ట్ వార్త);
నర్సంపేట నియోజకవర్గంలో ని
- ఖానాపురం ప్రధాన రహదారిపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, బాధితుడిని చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
ప్రస్తుతం సదరు వ్యక్తి మృతదేహం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంది. మృతుడి వివరాలు తెలిసే అవకాశం లేకపోవడంతో, సంబంధిత వ్యక్తులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.
సంప్రదించాల్సిన వివరాలు
నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి,
సహాయం కోసం ఫోన్ నంబర్ ,9703036175