మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ని కలిసిన కౌన్సిలర్‌గా ఎన్నికైన మాలోత్ దేవేందర్

journalist vaartha
By -

ఐనవోలు/ఫిబ్రవరి23(జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట మున్సిపాలిటీ 6వ వార్డు నూతన కౌన్సిలర్‌గా ఎన్నికైన మాలోత్ దేవేందర్, తమ వార్డుతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భాగంగా ఆయన, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావును హనుమకొండ జిల్లా, ఐనవోలు మండలంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ దేవేందర్, రవీందర్ రావును శాలువాతో ఘనంగా సన్మానించి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సీనియర్ నాయకులైన రవీందర్ రావుతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో జెత్య నాయక్, వెంకన్న, చందులాల్, రవి, యాకు, రాజేందర్, డి.సి. తండా నాయకులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.