కెసిఆర్ పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు- మాజి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

journalist vaartha
By -

రాయపర్తి/ఫిబ్రవరి 1(జర్నలిస్ట్ వార్త):బిఆర్ఎస్ పార్టీ అధినేత,మాజి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు అని మాజి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.మాజి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం బి ఆర్ ఎస్ నాయకులు వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై చేపట్టిన ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజి మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే నవంబర్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు.గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సాగు నీరు,త్రాగు నీరు లేక గ్రామాలన్నీ అధ్వానంగా ఉండేవని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల కరెంటు,సాగునీరు,త్రాగునీరు ఇచ్చి గ్రామాలన్నీ అభివృద్ది చేసిందని అన్నారు.ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వని హామీలు సైతం వృద్దులకు 2000 పెన్షన్,రైతు బంధు,కళ్యాణ లక్ష్మి వంటి పధకాలను ప్రవేశ పెట్టీ అమలు చేసిన ఘనత కేసీఆర్ దని అన్నారు.420 హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చిన లేదని అన్నారు.ఇటివల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనే ఉద్దేశ్యంతో బిఆర్ఎస్ నాయకులను తప్పుదోవ పట్టించేందుకు సిట్ విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహ నాయక్,మాజి ఎంపీపీ జినుగు ఎనిమి రెడ్డి,మాజి జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు,మాజి పాక్స్ ఛైర్మెన్ కుందూరు రామచంద్రారెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి,భూక్యా భద్రు నాయక్,కుక్కల భాస్కర్,భూక్యా దీప్ల నాయక్,చేడుపాక కుమార్, గారే నర్సయ్య,ఐత రాంచందర్, చందు రాము,సంకినేని ఎల్లాస్వామి, గారే విష్ణు తదితరులు పాల్గొన్నారు.