ముప్పారంలో అభివృద్ధి పనులకు శ్రీకారంభూమిపూజ చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

journalist vaartha
By -

ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరో ఫిబ్రవరి 28 (జర్నలిస్ట్ వార్త):
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల కంపౌండ్‌వాల్ నిర్మాణానికి, ఎస్సీ కాలనీలో వి.ఓ మహిళా భవనం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించడం, మహిళల సాధికారతకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర నిధులను సమర్థంగా వినియోగిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక-వెంకట్, ఉప సర్పంచ్ కుమారస్వామి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు గొల్లపల్లి వెంకటరాజ్యం, గోనెల రాజన్న, మాజీ ఎంపీటీసీలు కందుకూరి ప్రసాద్, పెద్ద శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.