ఆదర్శమూర్తికి అరుదైన జాతీయ గౌరవంబడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పోలిమేర జయరావుకు ఎస్సీ–ఎస్టీ–బీసీ జాతీయ కమిషన్ అధ్యక్ష బాధ్యతలుసేవా తపనకు దేశ స్థాయిలో గుర్తింపు – ధర్మసాగర్‌లో ఆనందోత్సాహాలు

journalist vaartha
By -

ధర్మసాగర్,/హనుమకొండ బ్యూరో ఫిబ్రవరి 14 (జర్నలిస్ట్ వార్త):
బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న ఏలూరు పీఠాధిపతులు పోలిమేర జయరావు గారికి దేశ స్థాయిలో ఎస్సీ–ఎస్టీ–బీసీ జాతీయ కమిషన్ అధ్యక్ష బాధ్యతలు దక్కడం గర్వకారణమని ఫాదర్ జోజి బాబు అన్నారు. ఆదివారం పునీత అంతోని వారి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఆయన మాట్లాడారు.
ధర్మసాగర్ గ్రామ ముద్దుబిడ్డగా ఎదిగిన జయరావు చిన్ననాటి నుంచే సేవాభావంతో ముందుకు సాగారని, పేదలు, బీదలు, అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేశారని తెలిపారు. విద్య, వైద్యం, సామాజిక రంగాల్లో ఆయన అందించిన సేవలు అనేక కుటుంబాలకు అండగా నిలిచాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
ఆయన సేవలను గుర్తించిన Leo John Paul Catholic Organization సంస్థ తరఫున జాతీయ ఎస్సీ–ఎస్టీ–బీసీ కమిషన్ అధ్యక్షునిగా నియమించడం హర్షణీయమన్నారు. ఈ బాధ్యతల ద్వారా వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణకు, వారి అభ్యున్నతికి మరింత విశాల స్థాయిలో సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంగా హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు పూల అంతోని భారతదేశ పీఠాధిపతుల సారథిగా ఎన్నిక కావడం ఆనందదాయకమని తెలిపారు. దేశవ్యాప్తంగా రోమన్ క్యాథలిక్ మిషన్ విశ్వాసులకు మరింత సేవ చేసే దిశగా ఈ నిర్ణయాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
జయరావు నియామకంతో ధర్మసాగర్ గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామ పెద్దలు, సంఘ ప్రతినిధులు, విశ్వాసులు ఆయనను పుష్పమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుకు రావాలని ఆకాంక్షించారు.అనంతరం కీర్తిశేషులు గంగారపు ఆదాం పేరుతో స్థాపించబడిన జి.ఏ.ఎస్.ఎఫ్ ఫౌండేషన్ గృహాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గురువులు మాచర్ల నవీన్, మారేపల్లి ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచి మాచర్ల జ్యోతి ఏలియా, సంఘ పెద్దలు పొలిమేర చిరంజీవి, గంగారపు సుధాకర్, మాచర్ల ప్రవీణ్, నక్క సుధాకర్, కొట్టే శ్రీనివాస్, నక్క కరుణాకర్, కొట్టే గణేష్, పొలిమేర రాజన్ బాబు, కొట్టే యాదగిరి, కొట్టే రాజు, ఉపదేశి గంగారపు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.జయరావు చేపట్టిన సేవా యాత్ర మరింత ఉన్నత స్థాయికి చేరాలని, ఆయన ద్వారా సమాజానికి విశేష సేవలు అందాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.