అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

journalist vaartha
By -
భీమదేవరపల్లి/ఫిబ్రవరి5 (జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తపల్లి కుమార్ (36) అనారోగ్య సమస్యల కారణంగా గురువారం తన వ్యవసాయ భూమిలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ముల్కనూర్ ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం, కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మానసిక ఒత్తిడికి లోనవ్వగా, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతుని తల్లి కొత్తపల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.