పోలీసుల సహకారంతో స్వయంకృషి కాలనీ రోడ్డు సమస్య పరిష్కారం

journalist vaartha
By -
ధర్మసాగర్/ఫిబ్రవరి 4 హనుమకొండ బ్యూరో(జర్నలిస్ట్ వార్త):
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని స్వయంకృషి కాలనీలో దాతల సహకారంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఏర్పడిన వివాదం పోలీసుల జోక్యంతో పరిష్కారమైంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా జరుగుతున్న రోడ్డు పనులను కొందరు అడ్డుకోవడంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
విషయం తెలుసుకున్న గ్రామ పాలకవర్గ సభ్యులు, కాలనీవాసులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బుధవారం పరిస్థితిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు ధర్మసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు స్థల హద్దులను స్పష్టంగా నిర్ధారించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించారు.పోలీసుల చర్యలతో రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగిపోవడంతో కాలనీవాసులు ఊరట చెందారు. సమస్యను సమర్థవంతంగా పరిష్కరించిన ధర్మసాగర్ గ్రామపంచాయతీ పాలకవర్గం ధర్మసాగర్ పోలీసులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.