కాజిపేట్,/హనుమకొండ బ్యూరోమార్చి 10: (జర్నలిస్ట్ వార్త)హనుమకొండ జిల్లా కాజిపేట్ మండలంలోని డీజిల్ కాలనీలో ఉన్న కృష్ణవేణి ప్రతిభా పాఠశాల విద్యార్థులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రశ్నోత్తర పోటీలలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి తీసుకొచ్చారు. విద్యార్థులు సాధించిన విజయంపై పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది.ఈ పోటీలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి నీలేష్ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాడు. అలాగే పాఠశాలకు చెందిన అరుణ్ విశాల్, మాన్విత్, భవిష్య, వర్షిత్, ఫాతిమా బేగం, సదృశ్య, మోక్ష, తియాంషి, పూజశ్రీ, భవాని సింగ్, నేతన్, పున్నం చందర్, మాన్విత్, మను వరుణ్, శశిప్రియ, నిరోషిని, ప్రణీత్, గాయత్రీ దేవి తదితర విద్యార్థులు కూడా తమ ప్రతిభను చాటుకుని మంచి ఫలితాలు సాధించారు.విజేత విద్యార్థులకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సభామందిరంలో నిర్వహించిన ప్రతిభా సత్కార వేడుకలో పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వట్నాల శ్రీనివాస్, విద్యా విభాగాధిపతి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయాలు పాఠశాలకు గర్వకారణమని తెలిపారు. ఈ విజయానికి కాజిపేట్ శాఖ ప్రధానోపాధ్యాయురాలు నుజ్ హత్, ఉప ప్రధానోపాధ్యాయుడు విజయ్ మరియు ఉపాధ్యాయుల కృషి ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.విద్యార్థులు సాధించిన విజయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రశ్నోత్తర పోటీలలో కృష్ణవేణి ప్రతిభా పాఠశాల విద్యార్థుల ప్రతిభ
By -
March 10, 2026