వైరా/మార్చి8(జర్నలిస్ట్ వార్త):
వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరాయపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన మిద్దె నరేందర్ - రాజేశ్వరిల వివాహ వేడుక సందడి నెలకొంది. ఈ వేడుకకు సహాయ హస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు కాంపల్లి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న నరేందర్, రాజేశ్వరిలు అన్యోన్యంగా ఉంటూ, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ మంగళప్రదమైన కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు , ప్రముఖులు సునీల్, నాగేశ్వరరావు, వెంకటకృష్ణ, అయోధ్యరావు తదితరులు పాల్గొన్నారు.