ధర్మసాగర్‌లో గుడ్ ఫ్రైడే వేడుకలు

journalist vaartha
By -
ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరో ఏప్రిల్ 03 (జర్నలిస్ట్ వార్త)హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని రోమన్ క్యాథలిక్ చర్చ్ విచారణ గురువులు జ్యోతి బాబు ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ బస్టాండ్ నుండి ధర్మసాగర్ రిజర్వాయర్ కొండపై ఉన్న సహాయమాత వరకు 14 స్థలాల్లో భక్తిశ్రద్ధలతో శిలువ మార్గం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు ఏసు ప్రభువు సిలువను మోస్తూ, ప్రార్థనలు చేస్తూ ఎంతో భక్తి పరవశంతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫాదర్ జోజి బాబు మాట్లాడుతూ, గుడ్ ఫ్రైడే రోజు యేసు క్రీస్తు మానవాళి పాప విమోచన కోసం తన ప్రాణాలను అర్పించిన త్యాగాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజు అని తెలిపారు. ప్రేమ, క్షమ, త్యాగం అనే మహోన్నత విలువలను మన జీవితాల్లో ఆచరించాలని, సమాజంలో మంచిని పెంపొందించుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు.