నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏఎంసీ చైర్మన్ నరుడు వెంకటయ్య

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఏప్రిల్ 12(జర్నలిస్ట్ వార్త)): మండల పరిధిలోని కట్ర్యాల ఎక్స్ రోడ్డులో గల కళ్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్‌ లో ఆదివారం జరిగిన వివాహ వేడుకకు వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేమునూరి స్వాతి, బ్రహ్మం దంపతుల కుమార్తె సంజన, సురేష్‌ల వివాహ మహోత్సవంలో ఆయన పాల్గొని, నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
వెంకటయ్యతో పాటు కట్ర్యాల ఉపసర్పంచ్ నంపెల్లి రవీందర్ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు తీగల సునీత గౌడ్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్, యూత్ కాంగ్రెస్ నాయకులు కొండ్రాతి సంతోష్, వేమునూరి జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.