ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి. మహేందర్ మాదిగ

journalist vaartha
By -
వర్ధన్నపేట/ మే 13(జర్నలిస్ట్ వార్త): వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను యధావిధిగా నడపాలని కోరుతూ బుధవారం ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. బొల్లిగుంట గ్రామంలో సిసి రోడ్డు పనులు జరుగుతుండటంతో గత ఐదు రోజులుగా నల్లబెల్లికి రావాల్సిన బస్సు ట్రిప్పులు ఐదుకు బదులు మూడు మాత్రమే వస్తున్నాయని, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు బీరు మహేందర్ మాదిగ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం వయా పంతిని మీదుగా బస్సులను యధావిధిగా నడపాలని కోరారు. డిపో మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ సొసైటీ డైరెక్టర్ మల్యాల దేవేందర్, గ్రామ వార్డు సభ్యులు గోలి సుధాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.