పర్వతగిరి/మే8(జర్నలిస్ట్ వార్త);వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనిగల్ గ్రామంలో జిల్లా కాంగ్రెస్ నాయకురాలు మాసాని సువార్త సమక్షంలో నూతన పాలకవర్గ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన నూతన వార్డు సభ్యులు గోలి సుధాకర్, మరుపట్ల ప్రశాంత్, బరిగల రేణుక, మరియు బిర్రు రేణుకలను ఆమె శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాసాని సువార్త మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, నూతన పాలకవర్గం వార్డుల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని ఆమె సూచించారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని, పారదర్శకమైన పాలనతో ప్రజలకు చేరువ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు. సన్మానం పొందిన వార్డు సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.