వర్ధన్నపేట/మే 24(జర్నలిస్ట్ వార్త);
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు మడత ప్రశాంత్ తల్లి మడత సుభద్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదివారం వారి నివాసానికి వెళ్లారు. సుభద్ర భౌతికదేహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట వర్ధన్నపేట పి ఎస్ సీ ఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, గ్రామ సర్పంచ్ కుళ్ళ పావని యకాంతం,