వర్ధన్నపేట/మే 24(జర్నలిస్ట్ వార్త);
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 59వ జన్మదిన వేడుకలను వర్ధన్నపేట మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ కన్నయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి, టీపీసీసీ అధ్యక్షుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి మహేష్ కుమార్ గౌడ్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.