హన్మకొండ/మే 24 (జర్నలిస్ట్ వార్త):
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అనంతరం మొదటిసారి వరంగల్ నగరానికి విచ్చేసిన వేం నరేందర్ రెడ్డిని ఆదివారం మార్నేని దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ టీజీ క్యాబ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎంపీపీ మార్నేని మధుమతి లు ఎంపీ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో వారు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. వీరితో పాటు పాక్స్ వర్ధన్నపేట చైర్మన్ రాజేష్ కన్నా కూడా ఎంపీని కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొని ఎంపీకి ఘన స్వాగతం పలికారు.