మునిగాల, చాగంటి కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్

journalist vaartha
By -
ఐనవోలు/ మే 24 (జర్నలిస్ట్ వార్త):
ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య పితృవియోగం చెందగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. సమ్మయ్య తండ్రి మొగిలి పార్థివ దేహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మరణించిన చాగంటి యాదగిరి, పురుషోత్తంల తండ్రి వెంకటయ్య కుటుంబ సభ్యులను కూడా రమేష్ కలుసుకున్నారు. రెండు కుటుంబాల సభ్యులను ఓదారుస్తూ, వారికి తన సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.