వరంగల్/మే 22 (జర్నలిస్ట్ వార్త): వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి మాట్లాడుతూ, భాగ్యరెడ్డి వర్మ అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మహిళల, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆయన ప్రత్యేక పాఠశాలలను స్థాపించారని గుర్తుచేశారు. దళిత రత్న అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ మాదిగ మాట్లాడుతూ, జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల కొరకు 33 పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. మాల మహానాడు జాతీయ నాయకులు మన్నె బాబురావు, టీఎస్ ఎమ్మార్పీఎస్ నాయకులు కేదాసి మోహన్ మాదిగ ఆయనను భావితరాలకు ఆదర్శవంతమైన దళిత ఉద్యమ కెరటంగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఈ మహోన్నత నాయకుడి జన్మదిన వేడుకలను మరింత అంగరంగ వైభవంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, జెడ్పీ సీఈఓ, అంబేద్కర్ సంఘం నాయకులు మిద్దపాక ఎల్లయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సంఘీ ఎలేందర్, సోషల్ వెల్ఫేర్ డీడీతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ
By -
May 21, 2026