బయ్యారం/,మే 24.(జర్నలిస్ట్ వార్త);
బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీకి జెడ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ తరపున నారగోని రాకేష్ మూడు సోలార్ లైట్లను కొత్తపేట సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ కు ఆదివారం అందజేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాలు అందిస్తున్న జెడ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ వారికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ భూక్య శ్రీను,కారుబోతుల రామ్మూర్తి,బుర్ర దుర్గారావు,నారగోని రాంబాబు తదితరులు ఉన్నారు.