బయ్యారం/,మే 24.(జర్నలిస్ట్ వార్త);
మండలంలో ఆదివారం ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ తో మాచర్ల శ్రీను (52) మృతి చెందినట్లు ఎస్సై ప్రశాంత్ బాబు తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గంధంపల్లి గ్రామంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడని,సత్యనారాయణపురం గ్రామంలో చెమట కుమారస్వామి వ్యవసాయ విద్యుత్ మోటారు ఫీజు మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు మృతుడి కుమారుడు శివ తెలిపారు.శివ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రశాంత్ బాబు తెలిపారు.