ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి.

journalist vaartha
By -
వర్ధన్నపేట/మే 24 (జర్నలిస్ట్ వార్త);
 ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదు చేయడాన్ని రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ  రాష్ట్ర కమిటీ సభ్యుడు వల్లందాస్ కుమార్‌ తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు, విశ్లేషకులపై కక్షపూరితంగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన మండిపడ్డారు. జనసేన నాయకుల ప్రోద్బలంతోనే ఏపీలో ఈ కేసులు పెట్టించారని, ప్రశ్నించే గొంతుకలను భయపెట్టాలని చూడడం ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ పలువురు జర్నలిస్టులపై కేసులు పెట్టారని గుర్తు చేస్తూ.నాగేశ్వర్‌ అన్ని పార్టీలనూ నిష్పక్షపాతంగా ప్రశ్నించే వ్యక్తని కొనియాడారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా సోషల్ మీడియాలో అవమానించడం, పోలీసులతో వేధించడం తగదన్నారు. ఏపీ ప్రజలకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేస్తూ, వెంటనే నాగేశ్వర్‌పై ఉన్న కేసులను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.