5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని వైద్యాధికారి డాక్టర్ రాజ్‌కుమార్ పిలుపు

journalist vaartha
By -
ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరోజూన్ 28 (జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని 17 గ్రామాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని గ్రామపంచాయతీల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ధర్మసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు.గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, యువత, ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లోని చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించేలా అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మండలంలోని ముప్పారం గ్రామంలో సర్పంచ్ గుంటిపల్లి రేణుక, ధర్మసాగర్ మండల కేంద్రంలో సర్పంచ్ మాచర్ల జ్యోతి-ఏలియా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని వైద్యశాఖ అధికారులు కోరారు.