ధర్మసాగర్, /హనుమకొండ బ్యూరో జూన్ 24 (జర్నలిస్ట్ వార్త):ధర్మసాగర్ మండలానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మార్వోను సీపీఐ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ, భూసంబంధిత సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు.ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అంశాలను వేగంగా పరిష్కరించాలని నాయకులు కోరారు. నాయకుల వినతులను శ్రద్ధగా విన్న ఎమ్మార్వో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ధర్మసాగర్ మండల అధ్యక్షుడు బట్టు మల్లయ్య, గ్రామ కార్యదర్శి చిలుక బాబు, మండల సహాయ కార్యదర్శి కనికటి రాజయ్య, మాది మండల అధ్యక్షుడు దోకి రాజయ్య నారాయణగిరి గ్రామ కార్యదర్శి ధర్మారెడ్డి, వల్లపు వెంకన్న, సాయిపేట లచ్చయ్య, సోంపల్లి సుధాకర్, సోంపల్లి మేరీలతో పాటు దళిత హక్కుల పోరాట సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాజారపు రత్నం పాల్గొన్నారు.