నారాయణగిరిలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏర్పాటు

journalist vaartha
By -
ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో జూన్ 22 (జర్నలిస్ట్ వార్త): ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘గో టు విలేజ్’ కార్యక్రమంలో భాగంగా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు.ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామ గౌరవ అధ్యక్షుడిగా వక్కల వీరయ్య, అధ్యక్షుడిగా వక్కల అక్షిత్ మాదిగ, అధికార ప్రతినిధిగా చిట్యాల కృపానంద్ మాదిగను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వక్కల రూసన్ మాదిగ, కొలిపాక కుమార్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా రాజరాపు ప్రశాంత్ మాదిగ, ప్రచార కార్యదర్శిగా వక్కల రాహుల్ మాదిగ, కార్యదర్శిగా వక్కల రాకేష్, కోశాధికారిగా వక్కల అశోక్, సహాయ కార్యదర్శులుగా గొకల మహేష్ మాదిగ, వక్కల మహేందర్ మాదిగ బాధ్యతలు చేపట్టారు.
కమిటీ సభ్యులుగా వక్కల వెంకటేష్, వక్కల వినయ్, వక్కల సిద్ధు, ఎం.శ్రీకాంత్, పీ.వికాస్, వక్కల రాములు, వక్కల రవి తదితరులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో సంస్థను బలోపేతం చేసి సామాజిక హక్కుల సాధన కోసం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.