ధర్మసాగర్‌లో పల్స్ పోలియోకు విశేష స్పందనచిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మాజీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు కొట్టే ప్రవీణ్

journalist vaartha
By -

ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో జూన్ 28 (జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన బూత్ నంబర్-3లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు కొట్టే ప్రవీణ్ పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొని పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను పోలియో బూత్‌లకు తీసుకువచ్చి చుక్కలు వేయించుకోవాలని ఆరోగ్య సిబ్బంది సూచించారు.