ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరో జూన్ 28 (జర్నలిస్ట్ వార్త): పోలియో రహిత భారతదేశం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్ద పెండ్యాల గ్రామంలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. గ్రామంలోని ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా గ్రామ పంచాయతీ ఆవరణ, మార్కండేయ దేవాలయం, ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మూడు పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. కరుణాపురం గ్రామ ప్రజల కోసం గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రత్యేక బూత్‌ను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.
కార్యక్రమాన్ని పెద్ద పెండ్యాల గ్రామ సర్పంచ్ తోట నాగరాజు ప్రారంభించగా, కరుణాపురం గ్రామ సర్పంచ్ రీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు లింగారెడ్డి, గ్రామ పెద్దలు, పల్లె దవాఖాన వైద్యాధికారి డా. మహేందర్‌రావు పుట్ట, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎంలు సీతాదేవి, రజిత, అంగన్‌వాడీ టీచర్లు శ్రీలత, అరుణాదేవి, నసీమా, స్వప్న, ఆశా కార్యకర్తలు మహేశ్వరి, రాణి, లక్ష్మి, రజిత తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు సహకరించాలి.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా మాత్రమే పోలియో రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ప్రతి చిన్నారిని సమీప పోలియో బూత్‌కు తీసుకొచ్చి చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.