వర్ధన్నపేట/జూన్ 12(జర్నలిస్ట్ వార్త);
మండలంలోని నల్లబెల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు రూపాయలు 80,000ఒక
గేదె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. గ్రామ వార్డు సభ్యుడు ఆరెల్లి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.వారి ఇంటి సమీపంలో ఎర్త్, విద్యుత్ వైర్ల సమస్య ఉందని స్థానిక లైన్‌మెన్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా సదరు అధికారి నిర్లక్ష్యం వహిస్తూ, రేపు చేస్తా మాపు చేస్తా అంటూ కాలయాపన చేశారని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఇతర విద్యుత్ సమస్యలపై పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా లైన్‌మెన్ స్పందించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఘోరంగా విఫలమై, మూగజీవి మృతికి కారణమైన సదరు ఉద్యోగిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.