ఎస్సీ కమ్యూనిటీ హాల్ పక్కన గోపి నగర్ బోర్డుపై వివాదంసర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి గ్రామస్తుల ఫిర్యాదు

journalist vaartha
By -
ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో జూన్ 17( జర్నలిస్ట్ వార్త)హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ కమ్యూనిటీ హాల్ పక్కన ఏర్పాటు చేసిన "గోపి నగర్" బోర్డుపై వివాదం నెలకొంది. ఈ విషయమై ఎస్సీ కాలనీ గ్రామస్తులు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.గ్రామస్తుల కథనం ప్రకారం, ఒక కాలనీ లేదా ప్రాంతానికి పేరు నిర్ణయించి బోర్డు ఏర్పాటు చేయాలంటే గ్రామపంచాయతీ, సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అయితే ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో, అలాగే స్నేహ కాలనీలో "గోపి నగర్" పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారని ఆరోపించారు.
ప్రభుత్వ ఆస్తుల సమీపంలో అనుమతులు లేకుండా బోర్డులు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని, వెంటనే వాటిని తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.బోర్డులను తొలగించడంలో ఆలస్యం జరిగితే గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పంచాయతీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.