హనుమకొండ బ్యూరో, జూలై 23 (జర్నలిస్ట్ వార్త): భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఎన్ఐటీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎంఎస్ జెండాను ఆవిష్కరించి సంఘం ఆశయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సామాజిక భద్రత కోసం బీఎంఎస్ ఆవిర్భావం నుంచి నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. అసంఘటిత రంగ కార్మికులతో పాటు అన్ని వర్గాల శ్రామికులకు న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల అమలే సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని, వారి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రతి కార్మికుడికి చేరేలా బీఎంఎస్ కృషి చేస్తోందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు, ఎన్ఐటీ ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్ఐటీలో ఘనంగా బీఎంఎస్ 72వ ఆవిర్భావ దినోత్సవంకార్మిక హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం: బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్
By -
July 23, 2026