లూయిస్‌విల్‌లో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

journalist vaartha
By -
హైదరాబాద్ డెస్క్/జులై 24(జర్నలిస్ట్ వార్త): అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్‌విల్ నగరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జన్మదిన వేడుకలను ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేటీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల రంగాలు సాధించిన పురోగతిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల ప్రకాష్ రావు, ప్రముఖ గాయకుడు మెట్టుపల్లి సురేందర్, దమ్మన్నపేట మాజీ సర్పంచ్ అర్జుల మంగా తిరుపతి రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగ ప్రతినిధి అర్జుల ఇతిహాస్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్తలు, తెలంగాణ శ్రేణులు పాల్గొని కేక్‌ కట్‌ చేసి వేడుకలను విజయవంతం చేశారు.