బిరమ్మ భౌతికదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

journalist vaartha
By -
వర్ధన్నపేట/జూలై 23(జర్నలిస్ట్ వార్త): మండల పరిధిలోని కట్రియాల గ్రామానికి చెందిన ఒగ్గు పూజారులు బెల్లం మల్లేశం, ధూడెల్, శ్రీశైలంల మాతృమూర్తి బీరమ్మ గురువారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు గ్రామానికి చేరుకుని, ఆమే భౌతికదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒగ్గు పూజారుల కుటుంబం కావడం, మల్లన్న స్వామి భక్తులు కావడంతో వారి కులదైవమైన కట్రియాల శ్రీమల్లికార్జున స్వామి ఆలయాభివృద్ధికి తక్షణమే రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ కన్నా, ఉప సర్పంచ్ నాంపల్లి రవీందర్, గ్రామ అధ్యక్షుడు బండారి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.