బెల్ట్ షాపులు బంద్ చేయాల్సిందే.. చట్టం ముందు ఎవరూ అతీతులు కారుసర్పంచ్ మాచర్ల జ్యోతి హెచ్చరికధర్మసాగర్‌లో అక్రమ మద్యం విక్రయాలపై పంచాయతీ కొరడాఏకగ్రీవ తీర్మానం.. నిర్వాహకులకు నోటీసులుచర్యలు తప్పవని స్పష్టం.. గ్రామస్తుల హర్షం

journalist vaartha
By -

ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో జూలై 2 (జర్నలిస్ట్ వార్త):ధర్మసాగర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులపై గ్రామపంచాయతీ ఉక్కుపాదం మోపింది. గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని గ్రామపంచాయతీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్మానం అమలులో భాగంగా బెల్ట్ షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తూ, వెంటనే మూసివేయాలని ఆదేశించింది.మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతితో వైన్ షాప్ అందుబాటులో ఉన్నప్పటికీ, గ్రామంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు సాగిస్తున్నారని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో యువత మద్యానికి బానిసలవడం, కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోవడం వంటి పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు.నోటీసులు అందుకున్న నిర్వాహకులు స్వచ్ఛందంగా బెల్ట్ షాపులను మూసివేయాలని, లేనిపక్షంలో పోలీసు, ఎక్సైజ్ శాఖల ద్వారా చట్టపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని పంచాయతీ హెచ్చరించింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి మాట్లాడుతూ, "గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. బెల్ట్ షాపులు తప్పనిసరిగా మూసివేయాలి. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తాం. గ్రామ యువత భవిష్యత్తు, కుటుంబాల సంక్షేమమే మా ప్రాధాన్యం" అని స్పష్టం చేశారు.సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్, కొంత కొమరమ్మ వార్డు సభ్యులు మేకల సంబరాలు మమతా రెడ్డి , జనగాని సుమన్ కళ్యాణి ప్రేమ్ కుమార్ బొడ్డు రఘు గంగారపు శ్యామ్ ,ప్రతిభ పాల్గొన్నారు.