ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో, జూలై 4 (జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా నియమితులైన తాటికాయల గ్రామానికి చెందిన పెసర రమేష్‌కు శనివారం సుస్మిత ఫంక్షన్ హాల్‌లో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ముఖ్య కార్యకర్తల పరిచయ సమావేశం జరిగింది.గత మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించిన గుర్ర ప్రసాద్‌ను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు.అనంతరం నూతన అధ్యక్షుడు పెసర రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని మండలంలో మరింత బలోపేతం చేసేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, మండల కమిటీ సభ్యులు, సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ధర్మసాగర్ మండల కాంగ్రెస్‌కు కొత్త ఊపుమండల అధ్యక్షుడు పెసర రమేష్‌కు ఘన సన్మానం..కార్యకర్తల పరిచయ సమావేశం
By -
July 04, 2026