క్యాతంపల్లిలో మృతుల కుటుంబాలకు కడియం శ్రీహరి పరామర్శ

journalist vaartha
By -

ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో జూలై 9 (జర్నలిస్ట్ వార్త);ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో ఇటీవల మృతిచెందిన మాజీ ఎంపీపీ కుర్సపల్లి బుచ్చయ్య కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పరామర్శించారు. బుచ్చయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ, తాను కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయం అందజేశారు.
అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కెర సంపత్ రెడ్డి తండ్రి ముక్కెర వెంకట్ రెడ్డి ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకట్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచిస్తూ తన సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్, స్థానిక సర్పంచ్ బాలస్వామి, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.