ఎలుకుర్తి పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా బేరె మధుకర్

journalist vaartha
By -
ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరో జూలై 12(జర్నలిస్ట్ వార్త)ఎలుకుర్తి గ్రామంలోని పెరిక కుల భవనంలో ఆదివారం పెరిక కుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ అధికారులుగా బేరె కేదారి, బేరె జనార్ధన్ వ్యవహరించారు. ఎన్నికల్లో బేరె మధుకర్ ఏకగ్రీవంగా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ సభ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడిని సంఘ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.