భీమదేవరపల్లి/జూలై11 (జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, బండి సంజయ్ కుమార్ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి బండి సంజయ్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. వీరభద్ర స్వామి ఆశీస్సులతో దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేసేలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామి, రసూల్‌పల్లె సర్పంచ్ బోయినీ మహేష్, గుండెల్లి సదానందం, పయ్యావుల రాజు, కంకణ సదానందం, మేకల రాజు, తీగల రాజు, శనిగరపు ఐలయ్య, లక్కిరెడ్డి మల్లారెడ్డి, ములుగు సంపత్, రామారావు భద్రయ్య, అయిత సాయి తేజ, దొంగల రానా ప్రతాప్, బొల్లంపల్లి శ్యామ్, సింగం రాజేందర్, రామారావు అర్జున్, గణేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.