భీమదేవరపల్లి/జూలై11 (జర్నలిస్ట్ వార్త): భారతీయ జనతా పార్టీ సిద్ధిపేట జిల్లా కమిటీని పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ కమిటీలో భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామిని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించింది. ఈ సందర్భంగా మాచర్ల కుమారస్వామి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్ష పదవిని అప్పగించిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నియామకానికి ఆమోదం తెలిపిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని మాచర్ల కుమారస్వామి పేర్కొన్నారు.
బీజేపీ సిద్ధిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా మాచర్ల కుమారస్వామి
By -
July 11, 2026